News January 27, 2025

సిరిసిల్ల: ప్రత్యేక అధికారుల నియామకం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఇన్‌ఛార్జి ప్రత్యేక పాలనాధికారిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఘా నియమితులయ్యారు. మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 26వ తేదితో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది.

Similar News

News September 13, 2025

NRPT: లోక్ అదాలత్‌లో 5,581 కేసుల పరిష్కారం

image

నారాయణపేట, కోస్గి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 5,581 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ.22,17,956 ఆదాయం సమకూరిందని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 13, 2025

ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

image

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.

News September 13, 2025

ఈ నెల 14 వరకు ఏపీ లాసెట్-25కు దరఖాస్తులు

image

ఏపీ లాసెట్-25 ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 11నుంచి 14 వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతాకుమారి పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 17లోపు వెబ్ ఆప్షన్ల నమోదు, 18లోపు వెబ్ ఆప్షన్లలో మార్పు చేసుకోవచ్చు. 20న సీట్ అలాట్మెంట్, 22న తరగతులను ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.