News January 3, 2026

సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ నాగర్జున

image

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియామకమయ్యారు. వైద్య కళాశాల ప్రొఫెసర్ హెచ్‌ఓడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ వైస్ ప్రిన్సిపల్‌గా (అడ్మినిస్ట్రేటివ్ విభాగం ) నియమించారు.

Similar News

News January 9, 2026

వరంగల్‌లో పేపర్ లీకేజీ కలకలం!

image

ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి వరంగల్‌ వ్యవసాయ కళాశాలలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. కొందరు ఏఈఓలు పదోన్నతుల కోసం విశ్వవిద్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సహాయంతో పేపర్ కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్రులకు చేరవేసినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లాలో పేపర్ లీకేజీని గుర్తించిన అధికారులు వరంగల్ కేంద్రంగా జరిగినట్లు నిర్ధారించుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

News January 9, 2026

‘క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్’.. లాలూ ఫ్యామిలీపై ఢిల్లీ కోర్టు!

image

‘Land for jobs scam’ కేసులో RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. CBI ఛార్జ్‌షీట్ ప్రకారం.. లాలూ ఫ్యామిలీ ఒక ‘క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్’లా పనిచేసిందని న్యాయమూర్తి అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారు అనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. లాలూతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 46 మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు.

News January 9, 2026

మిస్సయిన ఫోన్‌ను నిమిషాల్లో గుర్తించారు!

image

సాధారణంగా ఫోన్ పోయిందంటే దొరకడం గగనమే అని ఆశలు వదులుకుంటాం. కానీ పోయిన ఫోన్‌ను క్షణాల్లో చేతిలో పెట్టి ఔరా అనిపించారు బెంగళూరు పోలీసులు. ఓ కాలేజీ విద్యార్థిని తన ఫోన్ పోయిందని ‘112’కు ఫిర్యాదు చేశారు. కేవలం 8 నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు GPS సాయంతో ఫోన్‌‌ను రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. అందుకే ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.