News April 13, 2026
సిరిసిల్ల: ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేములవాడ నుంచి కరీంనగర్ రోడ్డులో అవసరమైన సైన్ బోర్డు పెట్టి రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలన్నారు. హెల్మెట్ వినియోగం సీట్ బెల్ట్ ఇతర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News April 14, 2026
రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

IPLలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 57 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. భీకర టాపార్డర్ కాస్తా తొలి ఓవర్‌లోనే కుప్పకూలగా.. ఫెరీరా (69), జడేజా (45) వందకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. చివరికి 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. వైభవ్, జురెల్, ప్రిటోరియస్ డకౌట్ కాగా, జైస్వాల్(1), పరాగ్(4) విఫలమయ్యారు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీశారు.
News April 14, 2026
అమీన్‌పూర్‌లో కూల్చివేతలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.