News January 14, 2026
సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 14, 2026
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
News April 14, 2026
VJA: అంబేద్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ మూత!

విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ నిర్వహణ అటకెక్కింది. 90 మంది సామర్థ్యంతో నిర్మించిన ఈ థియేటర్ మరమ్మతుల సాకుతో మూతపడింది. మరోవైపు రూ.404 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.320 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.90 కోట్లతో కళామందిరం సిద్ధమైనా, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ పార్క్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఓపెన్ థియేటర్ గురించి ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వినిసిస్తున్నాయి.
News April 14, 2026
నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.


