News March 1, 2025
సిరిసిల్ల: ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట(M) కొండాపూర్‌కు చెందిన సోని(22) ప్రసవం కోసం వెళ్లి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సోని 9నెలల గర్భిణి కావడంతో గురువారం ప్రసవం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో KNRకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.

జగిత్యాల: కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి శ్రీయాన్స్ అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రగాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్కలు దాడి చేసి మెడపై గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.