News February 24, 2026
సిరిసిల్ల: ఫిబ్రవరి, మార్చిలో సదరం క్యాంపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న కంటిచూపు, మార్చి 5న వినికిడి, 10న మానసిక, 12, 13, 16న ఆర్థో పరీక్షలు ఉంటాయి. దివ్యాంగులు ఆధార్, ఫోటోలు, మెడికల్ రిపోర్ట్స్ తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
Similar News
News February 26, 2026
డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
News February 26, 2026
31,972 మంది విద్యార్థులు.. 143 పరీక్ష కేంద్రాలు

అనంతపురం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 31,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News February 26, 2026
BREAKING: అర్ధరాత్రి ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు

ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూర్ తదితర మండలాల్లో బుధవారం అర్ధరాత్రి 11:50 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని వస్తువులు కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.


