News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

Similar News

News November 13, 2025

దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

image

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు బుధవారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.12,550 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,200, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.11,800 పలకగా, మొత్తం 308 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.

News November 13, 2025

తొలితరం సంపాదకులు మన పండితారాధ్యుల నాగేశ్వరరావు

image

తొలితరం సంపాదకులైన పండితారాధ్యుల నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంటూరులో జన్మించారు. గుంటూరులోని AC కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన, పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు, ఆచార్య రంగా నెలకొల్పిన వాహిని పత్రికలో1932లో చేరారు. 1943-1959 ఆంధ్రపత్రికలో, 1960లో ఆంధ్రభూమిలో,1965లో ఆంధ్రజనతకు, 1966 నుంచి 1976 మరణించే వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. నేడు ఆయన వర్ధంతి

News November 13, 2025

NLG: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిపొందిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 34,023 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 19,697 ఇండ్లు మంజూరయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వీరికి మరుగుదొడ్లను మంజూరు చేయనున్నారు.