News April 7, 2025
సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళ మృతి

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.
Similar News
News April 9, 2025
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,540 పలకగా.. ఈరోజు రూ.7,520 పలికింది. బుధవారం యార్డుకు రైతులు 75 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,520, కనిష్ఠంగా రూ.7,150 పలికింది. గోనె సంచుల్లో 5 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,600 నుంచి రూ.6,300 వరకు పలికింది. కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.
News April 9, 2025
KNR పోలీసులు GREAT.. తండ్రి, పిల్లలను కాపాడారు!

కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న తండ్రిని కాపాడినట్లు కరీంనగర్ 2వ టౌన్ పోలీసులు తెలిపారు. విద్యానగర్‌కు చెందిన దశరథ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో మొబైల్ ఫోన్ ఆధారంగా ట్రై చేసి దశరథ్ అతని ఇద్దరి పిల్లలను క్షేమంగా అప్పజెప్పారు.
News April 9, 2025
వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్‌స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.