News January 2, 2026

సిరిసిల్ల: ఫేక్ ‘స్క్రీన్ షాట్’తో సైబర్ నేరగాళ్ల బురిడీ

image

సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు సైబర్ కేటుగాళ్లు పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించామని నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్లను వాట్సాప్‌కు పంపారు. అవి తమ అవసరాల కోసం ఉంచుకున్న డబ్బులని, తిరిగి పంపాలని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.

Similar News

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 2, 2026

భద్రాద్రి: హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతం.. లేఖ కలకలం

image

మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతంపై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. భద్రాచలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుట్ర వల్లే హిడ్మా పట్టుబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మాను ఆసుపత్రికి తరలిస్తానని నమ్మించి, పోలీసులకు సమాచారం ఇచ్చి రివార్డు సొమ్ము కోసం కుట్ర పన్నారని ఆరోపించారు.

News January 2, 2026

సిర్గాపూర్ SC హాస్టల్ వార్డెన్ సస్పెండ్

image

సిర్గాపూర్ SC హాస్టల్(బాలుర) వార్డెన్ కిషన్ నాయక్‌ను జిల్లా SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. కాగా వార్డెన్ తమను నిత్యం వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి బూతులు తిడుతున్నాడంటూ విద్యార్థులు నిన్న హాస్టల్ ముందు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవహారం పెద్దది కావడంతో విచారణ అనంతరం సదరు వార్డెన్‌పై వేటు పడింది.