News December 17, 2025
సిరిసిల్ల: బరిలో బాలింత.. హాస్పిటల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్టునాయక్ తండాకు చెందిన భూక్య వెన్నెల ప్రవీణ్‌కు ఆరు రోజుల కిందట బాబు జన్మించాడు. కాగా, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టునాయక్ తండాలో 8వ వార్డ్ మెంబర్‌గా వెన్నెల బరిలో నిలిచారు. పోలింగ్ కావడంతో దవాఖాన నుంచి నేరుగా తన పసిబిడ్డతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News December 17, 2025
పేరెంట్స్ కాబోతున్న నాగచైతన్య-శోభిత?

టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-శోభిత దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. తాజాగా ఓ ఈవెంట్‌లో తాతగా ప్రమోట్ కాబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు చైతూ తండ్రి నాగార్జున సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఒత్తిడి చేయడంతో సరైన సమయంలో తానే చెబుతానని చెప్పారు. కాగా ఈ మేలో శోభిత డ్రెస్సింగ్ చూసి తల్లి కాబోతోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ 2024 DECలో పెళ్లి చేసుకున్నారు.
News December 17, 2025
మంత్రి జూపాల్లి స్వగ్రామ లో గెలిచింది ఇతనే..!

కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దదగడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉడుతల భాస్కర్ విజయం సాధించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ మద్దతుదారు నిరంజన్ రెడ్డిపై 336 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
News December 17, 2025
వచ్చే ఏడాదిలో అందుబాటులోకి మూడో డిస్కం

TG: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని కిందికి 29,05,779 వ్యవసాయం, 489 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 1132 మిషన్ భగీరథ, 639 మున్సిపల్ వాటర్ కనెక్షన్లు వెళ్లనున్నాయి. జెన్‌కోకు చెల్లించాల్సిన రూ.26,950 కోట్లు, రూ.9,032 కోట్ల ప్రతిపాదిత రుణాలు, రూ.35,982 కోట్ల బకాయిలు ఈ డిస్కంకు మళ్లించబడతాయి. దీనికి 2వేల మంది ఉద్యోగులను కేటాయించనుంది.


