News December 5, 2025
సిరిసిల్ల: ‘బస్సులో నగదు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్’

డబ్బుల బ్యాగులు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగును బస్సులో నుంచి బండారి బాలరాజు ఎత్తుకెళ్లాడన్నారు. ఆ బ్యాగులో రూ.3,97,500 నగదు ఉందని బాధితులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News December 6, 2025
Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News December 6, 2025
ఫిట్‌నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్‌కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్‌నెస్ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.
News December 6, 2025
సిరిసిల్ల: స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరపాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి హాజరై మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.


