News April 5, 2025
సిరిసిల్ల : బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డా.బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. డా.బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
Similar News
News September 15, 2025
సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.
News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?
News September 15, 2025
‘జిల్లా వ్యాప్తంగా స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం’

పార్వతీపురం జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.