News January 7, 2026

సిరిసిల్ల: ‘బాల కార్మికులను బడిలో చేర్పించాలి’

image

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఆపరేషన్ స్మైల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు పిల్లలు భిక్షాటన చేస్తూ గాని, పనిచేస్తూ గానీ కనబడకూడదన్నారు. అలాంటివారు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించాలని ఆదేశించారు.

Similar News

News February 1, 2026

ప్రజాకర్షక పథకాల జోలికెళ్లని బడ్జెట్!

image

ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్యాకేజీలు, ప్రత్యేక పథకాల వంటివేమీ ప్రకటించలేదు. కేవలం కొన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులనే కట్టబెట్టారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా చేపట్టిన ఇనీషియేటివ్స్‌కు కొనసాగింపుగానే చాలా ప్రకటనలు ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ఉద్యోగులను ఆకర్షించే పెద్ద అనౌన్స్‌మెంట్స్ లేవని నిపుణులు అంటున్నారు.

News February 1, 2026

రాజమండ్రి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు

image

రాజమండ్రి నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అకౌంటింగ్ సంస్కరణల ప్రమోషన్‌లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాజమండ్రికి ఈ అవార్డు దక్కింది. గ్రేటర్ నోయిడాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News February 1, 2026

వనపర్తి: 9 మంది చిన్నారులకు అస్వస్థత

image

వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం ఎస్సీ వాడకు చెందిన నందిని, నైని, కిషోర్, ఆనంది, హేమంత్, రక్షిత, యశ్వంత్, హిమాన్షు, సౌమ్య అడవి ఆముదం కాయలు తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆడుకుంటూ వీటిని తినడంతో అందరికీ వాంతులయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.