News February 1, 2026

సిరిసిల్ల: బీఆర్ఎస్ శ్రేణుల వినూత్న నిరసనలు

image

బీఆర్ఎస్ నేత కేసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, రాజన్నపేటలో సీఎం దిష్టిబొమ్మకు కోడితో దిష్టి తీశారు. గుండారంలో రేవంత్ దిష్టిబొమ్మ వద్ద పార్టీ నాయకులు రోధిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2026

నిజామాబాద్: ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలి

image

నిజామాబాద్ నాగారంలోని తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్, క్లాట్, సీఏ ఉచిత కోచింగ్‌తో పాటు ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

News February 2, 2026

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖండించారు. ఇరాన్‌పై అమెరికా దాడికి దిగితే అది రెండు దేశాలకే పరిమితం కాదని, భీకరమైన ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమపై దాడి జరిగితే మాత్రం గట్టిగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో సంచలనం రేపుతున్నాయి.

News February 2, 2026

ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

image

☛ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
☛ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
☛ 1940: రచయిత ఎస్.వి. రామారావు జననం
☛ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
☛ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
☛ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం (ఫొటోలో)