News April 10, 2025

సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.

Similar News

News December 20, 2025

ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

image

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News December 20, 2025

మస్క్‌కు 55 బి.డాలర్ల ప్యాకేజీకి కోర్టు గ్రీన్ సిగ్నల్!

image

టెస్లా 2018లో మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల ప్యాకేజీని కోర్టు పునరుద్ధరించింది. గతంలో ఓ కోర్టు దీన్ని రద్దు చేయగా ఇప్పుడు డెలావేర్ కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కంపెనీని నిర్దేశిత లక్ష్యాలకు చేర్చారన్న పేరిట మస్క్‌కు సన్నిహితులైన బోర్డు సభ్యులు ప్యాకేజీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఒక వాటాదారు కోర్టుకు వెళ్లారు. తాజా తీర్పుతో మస్క్ ఆస్తి 679 బి.డాలర్లకు చేరుతుంది.

News December 20, 2025

ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

image

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.