News October 7, 2025
సిరిసిల్ల: మహర్షి వాల్మీకి SP నివాళి

వాల్మీకి గొప్ప మహనీయుడని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఓ సామాన్య వ్యక్తిగా వాల్మీకి పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణాన్ని రచించారని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్ర మన అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.
Similar News
News March 29, 2026
HYD: జిల్లాల్లో పడిపోతున్న గ్రౌండ్ లెవెల్స్

HYD, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. వేసవికి ముందే అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు సగటున 12.87 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
News March 29, 2026
NLG: ఎండుతున్న పొలాలు.. ట్యాంకర్లే దిక్కు!

జిల్లాలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక వరి పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు మునుగోడు, సూర్యాపేట, నడిగూడెం, రాజాపేట మండలాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేసి నీళ్లు పోయిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 29, 2026
మైదుకూరు: భర్త కోసం భార్య పోరాటం

మైదుకూరు పట్టణం శ్రీరామ్ నగర్‌లో ఉంటున్న భర్త కోసం భార్య అత్తవారి ఇంటి ముందు పోరాటానికి సిద్ధమైంది. తనకు వివాహమై మూడేళ్లయిన కాపురానికి రానివ్వడం లేదంటూ విహాహిత అత్తగారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. 16 తులాల బంగారం, రూ.7 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారని తన భర్త కాపురానికి పంపకుండా అత్త, మామ ఆడపడుచులు అడ్డుపడుతున్నారని న్యాయం చేయాలని కోరారు.


