News February 3, 2025

సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ

image

జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 3, 2025

ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్.. థాంక్యూ సాహా: BCCI

image

వృద్ధిమాన్ సాహా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ BCCI పోస్టర్ విడుదల చేసింది. సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్ అని పేర్కొంది. భారత జట్టుకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పింది. భవిష్యత్తు మంచిగా సాగాలని కోరుకుంటున్నట్లు విష్ చేసింది. సాహా 28ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ తదితర లెవెల్స్‌లో క్రికెట్ ఆడారు.

News February 3, 2025

పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం: ఎస్పీ

image

హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. ఒక్కరోజు ముందుగానే హిందూపురంలో పోలీసులతో సమావేశమై భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ఎన్నికలు నిర్వహించామన్నారు.

News February 3, 2025

ముస్తాబాద్: వైన్స్ పర్మిట్‌ రూమ్‌లో వ్యక్తి హఠన్మారణం

image

ముస్తాబాద్‌లోని కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్ షాపు పర్మిట్ రూమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నామాపూర్‌కు చెందిన తేపూరి నారాయణ(50) ఆదివారం రోజంతా పనిచేసి రాత్రి అక్కడే పర్మిట్ రూంలోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచాక పర్మిట్ రూంలోనే హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. మృతునికి అతిగా మద్యంతాగే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.