News May 25, 2024
సిరిసిల్ల: మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

తండ్రి శంకర్ మరణ వార్త విని గుండెపోటుతో కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన అనూహ్య ను తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ చాకచక్యంతో స్పందించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు రక్షించాడు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు అభినందించారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
News March 12, 2025
కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 12, 2025
సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.