News February 6, 2025

సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..

image

స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

జైపూర్: విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

image

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. అధికారులు తదితరులు ఉన్నారు.

News September 17, 2025

ఉద్యమాల పురిటి గడ్డ.. మెదక్ జిల్లా

image

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో మెదక్‌ నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెదక్‌‌ నుంచి మగ్దూం మోయినోద్దీన్, కేవల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్‌పల్లి’

image

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.