News December 4, 2025
సిరిసిల్ల: మాజీ సీఎం కే.రోశయ్యకు ఘన నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య వర్ధంతి వేడుకలను సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఇతర అధికారులతో కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్‌తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.
News December 5, 2025
ఫ్రెండ్‌తో అన్నీ పంచుకుంటున్నారా?

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. కానీ ఆ చెప్పే విషయాల్లో భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చవద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య జరిగే విషయాల్ని మూడోవ్యక్తితో చర్చించకపోవడమే మంచిదంటున్నారు. భాగస్వామితో చిన్న గొడవ గురించి స్నేహితులకు చెబితే మీవారిపై నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరుతూ ఉంటే నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. నల్గొండ జిల్లా వ్యయ పరిశీలకుడిగా ఆదిత్య

నల్గొండ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్.వెంకట్ ఆదిత్యను జిల్లా వ్యయ పరిశీలకుడిగా గురువారం నియమించారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల నమోదు, అక్రమ ఖర్చుల నియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తారని అధికారులు తెలిపారు.


