News September 5, 2025

సిరిసిల్ల: మానవత్వం చాటిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్

image

సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ మానవత్వం చాటుకున్నారు. వెంకట్రావుపల్లిలో ఎల్లారెడ్డిపేటకు చెందిన తల్లి కొడుకు బైక్ అదుపుతప్పి పడిపోయారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ అది గమనించి వారి వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మధ్యలో అంబులెన్స్ రావడంతో అంబులెన్స్‌లో ఎక్కించారు. మానవత్వం చాటుకున్న ఆయనను పలువురు అభినందించారు.

Similar News

News September 6, 2025

సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్‌ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం

News September 6, 2025

PHOTOS: ‘SIIMA’లో మెరిసిన తారలు

image

సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) కార్యక్రమం దుబాయ్‌లో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ హీరోలు, హీరోయిన్స్, నటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, మీనాక్షి చౌదరి, శ్రియ, నిహారిక, అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు సందడి చేశారు. వీరి ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News September 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.