News April 4, 2025
సిరిసిల్ల: మాయదారి వానలు.. అప్పులే గతి!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని జిల్లా రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News November 8, 2025
తిరుపతి: న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

న్యూ లుక్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ కోడ్‌తో తిరుపతిలో ఆయన పర్యటించారు. కెన్నెట్ అండర్సన్ రాసిన మ్యాన్ ఈటర్స్ అండ్ జంగల్ కిల్లర్స్ బుక్‌ను ఫారెస్ట్‌లో చదివి ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా కనిపించారు. మామండూరు అందాలకు మంత్రముగ్ధుడయ్యారు. జలపాతం అందాలను చూసి మైమరచి పోయారు. 105 ఏళ్ల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు.
News November 8, 2025
జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.
News November 8, 2025
60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ముందుగా దిన్‌కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.


