News February 17, 2025

సిరిసిల్ల: ‘మిడ్ మానేరులో నిర్మాణ పనులు ఆపివేయాలి’

image

మిడ్ మానేరులో ప్రైవేట్ కంపెనీ వాళ్లు అక్రమంగా కేజీ కల్చర్ నిర్మిస్తున్నారని జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్కల రాము అన్నారు. నేడు ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే నిర్మాణ పనులను ఆపేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక అధ్యక్షుడు, డైరెక్టర్లు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

జగిత్యాల జిల్లాలో 100% ఆయుష్మాన్ భారత్ టార్గెట్

image

జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలుపై అధికారులు సమీక్షించారు. జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 3,48,605 మంది నమోదు కాగా 100% లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. ప్రజలకు సమయానుకూలంగా వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 11, 2025

రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్‌ AMG G63 వ్యాగన్‌ మోడల్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్‌తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.

News November 11, 2025

రేపు పీఎమ్ ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రేపు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న100 గృహల ప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు.