News March 19, 2025
సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్‌కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.
Similar News
News March 20, 2025
గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.
News March 20, 2025
SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
News March 20, 2025
గజ్వేల్ MLA క్యాంప్ ఆఫీసుకు TOLET బోర్డు పెట్టిన బీజేపీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు టూలెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఎదుట ఆకస్మికంగా ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు కేసీఆర్ గజ్వేల్ రావాలని, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.