News January 9, 2025

సిరిసిల్ల: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పండుగకి ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌స్టేషన్లో లేదా గ్రామ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News February 19, 2026

KNR: మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

image

తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, సెక్రటరీ రాజగోపాల్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, పిఓడిటి డా.ఉమాశ్రీ తదితులున్నారు.

News February 19, 2026

KNR: ‘రైతు రిజిస్ట్రేషన్ నూరు శాతం పూర్తి చేయాలి’

image

వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ రకాల కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ కార్యక్రమాల సద్వినియోగం కోసం ఉద్దేశించిన రైతు రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తిచేయాలని అన్నారు. వ్యవసాయ అధికారి వద్ద మాత్రమే కాకుండా మీ సేవా కేంద్రాల్లో కూడా 15 రూపాయల రుసుముతో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తవుతుందనే అవగాహన రైతులకు కల్పించాలని తెలిపారు.

News February 19, 2026

KNR: ‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

image

జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.