News January 20, 2026

సిరిసిల్ల: ‘మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి’

image

పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

Similar News

News March 11, 2026

నెల్లూరు: ఆ రూ.20 కోట్లు ఎప్పుడిస్తారో..?

image

నెల్లూరు జిల్లాలో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ శాఖకు పౌర సరఫరాల శాఖ రూ.20 కోట్లు బాకీ పడినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేసినందుకు మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని సమాచారం. మార్కెటింగ్ శాఖ ఈ ఏడాది రూ.38 కోట్ల సెస్సు వసూలు చేయాల్సి ఉండగా రూ.27 కోట్లు రాబట్టింది. అలాగే పౌరసరఫరాల శాఖ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు.

News March 11, 2026

తిరుమలలో చోరీ వివాదం.. జగన్‌పై విమర్శలు

image

తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి జగన్ తన అనకొండలను వదిలారని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ‘భూమన తిరుపతికి కొత్త జేమ్స్ బాండ్. వైసీపీ హయాంలోనే పెంచలయ్య తిరుమలలో బంగారాన్ని దొంగలించాడు. ఆయన దగ్గర లంచం తీసుకుని ఉద్యోగం తీసిచ్చిన వ్యక్తి భూమన. నేను దేవుడి దగ్గర కాపలా కుక్కనే. నీ(భూమన)లా గుంట నక్కను కాదు. TTDలో కమీషన్లు తీసుకోలేదని కాణిపాకంలో భూమన ప్రమాణం చేస్తారా’ అని సవాల్ చేశారు.

News March 11, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,930
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,656
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720