News December 31, 2025

సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆశావహులు

image

మున్సిపల్ ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. జనవరి 10వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలోని వివిధ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఓటర్లకు చేరువ కావడంపై దృష్టి సారించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలపై అధికారులతో సమన్వయం అవుతూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.

Similar News

News December 31, 2025

రేపటి నుండి కొత్త రైల్వే టైమ్ టేబుల్….

image

వాల్తేరు డివిజన్ పరిధిలోని పలు కీలక రైళ్ల వేళలను రైల్వే శాఖ సవరించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కోరమాండల్, హీరాఖండ్ వంటి 11 ప్రధాన రైళ్ల సమయాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో రాకపోకల వేళలు మారుతాయని, ప్రయాణికులు ఎన్.టి.ఈ.ఎస్ (NTES) యాప్ ద్వారా తాజా సమయాలను సరిచూసుకోవాలని ఆయన కోరారు.

News December 31, 2025

నంద్యాల జిల్లాలో 93.86 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

image

నంద్యాల జిల్లాలో జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు బుధవారం పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 93.86శాతం పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు 2,13,630 మందికి గాను 2,00,520 మందికి పింఛన్లు అందజేశారు.

News December 31, 2025

ఎంత తాగితే డ్రంకన్ డ్రైవ్‌లో దొరకరు?

image

మందుబాబులు తలబాదుకునే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఒక బీరే కదా.. ఒక పెగ్గుకు ఏం కాదులే అనుకుంటే పొరపాటే. విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా.. ఏ రకమైనా గ్లాసు తాగినా టెస్టులో పాజిటివ్ (35పాయింట్స్) వస్తుంది. మందుతో పాటు మనుషుల శరీరాన్ని బట్టి, రక్తంలో ఆల్కహాల్ కలిసే సమయం ఆధారంగా ఈ రిజల్ట్ మారుతుంది. కాబట్టి మద్యం తాగడం, తాగకపోవడం మీ ఇష్టం. కానీ ఒక్క చుక్క బాడీలోకి వెళ్లినా బండి తీయకండి.