News January 22, 2026
సిరిసిల్ల మున్సిపాలిటీలో మహిళా రాజ్యమే!

సిరిసిల్ల గ్రామ పంచాయతీ నుంచి 1987లో మున్సిపాలిటీగా మారింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో రుద్ర సత్తెమ్మ చైర్మన్‌గా గెలుపొందారు. ప్రస్తుతం సిరిసిల్ల పురపాలకలో 1.01 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. 81,959 ఓటర్లకు గాను పురుషులు 39,942, మహిళలు 42,011 ఉన్నారు. మున్సిపల్లో ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా, 5 సార్లు మహిళలు చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా చైర్మన్ స్థానం మహిళలకే కేటాయించారు.
Similar News
News March 6, 2026
MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.
News March 6, 2026
సంక్షేమమే లక్ష్యంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్: మంత్రి పొన్నం

పారదర్శక పాలనతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఒక నిర్దిష్ట రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
News March 6, 2026
సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.


