News September 23, 2025
సిరిసిల్ల: మెసేజ్ యువర్ ఎస్పీ.. ఫిర్యాదులకు వాట్సప్ సేవలు

పోలీస్ స్టేషన్‌కు రాలేకపోతున్న ప్రజల కోసం సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా వాట్సప్ ద్వారా 6303922572 నంబర్‌కు పంపవచ్చని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎస్పీ చెప్పారు. ఈ సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 23, 2025
10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.
News September 23, 2025
పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 23, 2025
బాపట్ల అధికారులకు కలెక్టర్ సూచనలు

బాపట్ల కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని మున్సిపల్ పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.