News October 28, 2025
సిరిసిల్ల: యువతి MISSING.. PHOTO వైరల్..!

సిరిసిల్ల(D) చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన <<18122962>>ఏరెడ్డి అక్షయ(21)పై MISSING<<>> కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, ఆమె 5 రోజుల క్రితం రామన్నపేటకు చెందిన బాల్యమిత్రుడు, తెనుగు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే తాము పెళ్లి చేసుకున్నట్లు యువతి తన తండ్రికి పైఫొటో పంపినట్లు తెలుస్తోంది. ఈ ఫొటో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది. అక్షయ B.TECH ఫైనల్ ఇయర్ చదువుతోంది.
Similar News
News October 29, 2025
అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
News October 29, 2025
MBNR: కురుమూర్తి జాతర.. సమీక్షించిన ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా చిన్న తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా ఈ రోజు ఉద్దాల బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పరిశీలించారు. చిన్న వడ్డెమాన్ గ్రామం నుంచి ఉద్దాల కార్యక్రమం ప్రారంభమైన ప్రాంతం నుంచి ఉద్దాల గుడి వరకు ఎస్పీ స్వయంగా పర్యటించి, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యం, భద్రతా, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు.
News October 29, 2025
జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలను కమిషనర్ కేతన్ గార్గ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నామని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.


