News April 1, 2025

సిరిసిల్ల: యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 14వ తేదీలోగా https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీవో కార్యాలయం, పట్టణంలో మునిసిపల్ లో సమర్పించాలని స్పష్టం చేశారు.

Similar News

News November 10, 2025

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలి: నిట్ డైరెక్టర్

image

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలని నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి అన్నారు. సోమవారం ప్రపంచ సైన్స్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిట్‌లో అక్సాసెబుల్ అనలిటికల్ టెక్నాలజీపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన సుబుధి మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యార్థులు నిరంతరం పయనించాలన్నారు. సామజిక బాధ్యతగా ఆవిష్కరణలు చేయాలన్నారు.

News November 10, 2025

సంగారెడ్డి: దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్లు పూర్తయిన రోడ్లకు వెంటనే పనులు ప్రారంభించిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News November 10, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 109 ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం శామీర్‌పేట్ పరిధి అంతాయిపల్లిలోని జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియతో కలిసి 109 దరఖాస్తులను స్వీకరించారు.