News January 7, 2026

సిరిసిల్ల: ‘యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’

image

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో యూరియా కొరత ఉన్నట్లు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 9, 2026

భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.

News February 9, 2026

ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.

News February 9, 2026

KNR: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48గంటల ముందు ప్రచారం నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభలు, ప్రచార వాహనాలు పూర్తిగా నిషేధించబడతాయి. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వైన్ షాపులు కూడా పోలింగ్ ముగిసే వరకు మూసివేయనున్నారు. ఇక పట్టణ భవిష్యత్తును ఓటర్లు 11న తేల్చనున్నారు.