News January 1, 2026

సిరిసిల్ల: ‘రహదారి భద్రతా నియమాలు పాటించాలి’

image

రహదారి భద్రత నియమాలు పాటించే విధంగా రవాణా, పోలీసు శాఖలు సమన్వయంగా పనిచేయాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రహదారి భద్రతపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

వనపర్తి: ‘ఆపరేషన్ స్మైల్‌తో బాలకార్మికుల నిర్మూలన’

image

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తామని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ చెప్పారు. 2025 సంవత్సరంలో వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలు గణనీయంగా పురోగతిని సాధించాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఆయా శాఖల అధికారులతో కలిసి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.

News January 2, 2026

మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

image

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.

News January 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 02, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.