News October 17, 2025
సిరిసిల్ల: ‘రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతోంది’

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు ఇస్తూ కేంద్రంలో అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీసీ సంఘాలు అన్ని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే CPM మద్దతుగా పాల్గొంటుందన్నారు. లేనిచో స్వతంత్రంగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతుందన్నారు.
Similar News
News October 17, 2025
సిరిసిల్ల: ‘పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పరచాలి’

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు VPO వ్యవస్థ కలిగి ఉండాలని సిరిసిల్ల SP మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలన్నారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
News October 17, 2025
గంగాధర: పిల్లలలో లోపపోషణ నివారణకు పటిష్ట చర్యలు

పిల్లలలో లోపపోషణ నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. శుక్రవారం సభలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సేవలను పర్యవేక్షిస్తామన్నారు.
News October 17, 2025
లిక్కర్ షాపులకు నో ఇంట్రెస్ట్!

TG: లిక్కర్ షాపుల దరఖాస్తులకు అనుకున్నంత స్పందన రావట్లేదు. గతంతో పోలిస్తే నిన్నటి వరకు 55% తక్కువ దరఖాస్తులు రావడంతో అప్లికేషన్లు సమర్పించాలని అబ్కారీ శాఖ వ్యాపారులకు SMSలు పంపుతోంది. ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అలాగే గత మూడేళ్లతో పోల్చితే 2024లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
*దరఖాస్తులకు రేపే చివరి తేదీ.