News November 26, 2025

సిరిసిల్ల: రూప్లానాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం..?

image

సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రూప్లానాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూక్య జవహర్లాల్ నాయక్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, పోటీలో ఎవరూ ఉండవద్దని గ్రామస్థులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా భూక్య జవహర్లాల్ నాయక్‌ను గ్రామస్థులు అభినందించారు.

Similar News

News November 26, 2025

NGKL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

image

NGKLలో ప్రభుత్వ (డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి హాజరయ్యారు.అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అని అన్నారు.

News November 26, 2025

అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దాం: SP

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలోని పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

News November 26, 2025

ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

image

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.