News December 15, 2025
సిరిసిల్ల: రెండో విడతలో ఎవరికి ఎన్ని సీట్లంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో బోయినపల్లి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88 గ్రామ పంచాయతీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 స్థానాలలో విజయం సాధించారు. ప్రతిపక్ష భారాస బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 చోట్ల, సీపీఎం 1, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు.
Similar News
News March 4, 2026
కామారెడ్డి: సులభమైన మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయాలి

ఈ-నామ్ విధానం ద్వారా రైతులకు పారదర్శకతతో కూడిన సులభమైన, లాభదాయకమైన మార్కెటింగ్ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మద్నూర్ ఏఎంసీలో ఈ-నామ్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, కార్యదర్శులు, వ్యాపారులు పాల్గొన్నారు.
News March 4, 2026
కడప: ప్రత్యేక విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.
News March 4, 2026
గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నాం: ఖతర్

లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టుల ఉత్పత్తిని <<19269644>>నిలిపేస్తున్నట్లు<<>> ఖతర్ ప్రకటించింది. ‘గ్యాస్‌ను లిక్విడ్‌గా మార్చే ప్రక్రియను ఆపేస్తున్నాం. నెల రోజులు సూపర్ చిల్డ్ గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి చేయలేం’ అని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్లోబల్ LNG ఎగుమతుల్లో ఖతర్ వాటా 20%. తాజా నిర్ణయంతో ఇండియా, జపాన్, చైనా, యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి.


