News October 15, 2025

సిరిసిల్ల: ‘రేపు మినీ JOB MELA’

image

నిరుద్యోగ యువత మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ కోరారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో జరిగే మినీ జాబ్ మేళాకు హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 9493472412, 9700302582, 9885346768 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News October 15, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడి 82,380 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు వృద్ధి చెంది 25,262 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, L&T, ఎటర్నల్, బెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.

News October 15, 2025

సిరిసిల్లలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు..15 వాహనాలు సీజ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రవాణా శాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. టాక్స్, ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు. రేడియం స్టిక్కర్లు లేకుంటే ₹2000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగనున్నాయని తెలిపారు.

News October 15, 2025

అనుమతి లేని ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జిల్లాలో 26 వేల 582 ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు, ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. అనుమతి లేని ఆక్వా సాగుపై చర్యలు తీసుకోవాలన్నారు.