News December 1, 2025
సిరిసిల్ల: ‘రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటవెంటనే జమ చేయాలి’

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంటవెంటనే జమ కావాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీ, చెల్లింపులపై ఆమె సోమవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, రైతులను ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని DM, DCO, డీసీఎంఎస్ అధికారులకు స్పష్టం చేశారు.
Similar News
News March 9, 2026
వికారాబాద్ కలెక్టరేట్‌లో కుక్కల బెడద!

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కుక్కల స్వైర విహారం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది. కొంతకాలంగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ విధులకు వచ్చే ఉద్యోగులపై దాడులకు తెగబడుతుండటంతో భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ లోపలికి కూడా కుక్కలు ప్రవేశిస్తుండటంతో ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నామని, కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
News March 9, 2026
కుటుంబ కలహాలపై 20 అర్జీలు

ప్రజా ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో 58 పిటిషన్లు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలపై 20, ఇతర విభాగాలకు చెందిన 25 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు.
News March 9, 2026
కిమ్ వంతేనా? ట్రంప్ ‘డికాపిటేషన్’ స్కెచ్!(1/2)

అమెరికా అనుసరిస్తున్న ‘డికాపిటేషన్ స్ట్రైక్’ వ్యూహం ఇప్పుడు ప్రపంచ నియంతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మదురో బందీ కావడం, ఖమేనీ మృతిచెందడంతో.. తదుపరి లక్ష్యం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కానున్నారా? అనే చర్చ మొదలైంది. అమెరికా పాత సిద్ధాంతం ‘లీడర్‌షిప్ టార్గెటింగ్’ను ట్రంప్ ఆచరణలోకి తేవడంతో ప్యాంగ్‌యాంగ్‌లో భయం నెలకొంది. అయితే తమ జోలికి వస్తే అణుదాడి తప్పదని కిమ్ హెచ్చరిస్తున్నారు.


