News January 5, 2026
సిరిసిల్ల: రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురుచూపు!

జిల్లాలో వానాకాలం విక్రయాలు పూర్తికావడంతో రైతాంగం యాసంగి సాగుపై దృష్టి సారించింది. ఇప్పటికే వరి నాట్ల పనులు ముమ్మరం కాగా, అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. అయితే, సాగు ఖర్చులు పెరగడంతో పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 7, 2026
పాడేరు: SC,ST పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన IDP పాలసీ 2024-29 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించిందని జిల్లా పరిశ్రమల అధికారులు శుక్రవారం తెలిపారు. తయారీ, సర్వీసు రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి 45 శాతం రాయితీ లభిస్తుందన్నారు. హోటల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలపై కూడా రాయితీ ఉంటుందన్నారు.
News February 7, 2026
బాలీవుడ్‌లో 90% పెళ్లిళ్లు ఫేక్: ‘హిట్-3’ నటుడు

బాలీవుడ్‌లో 90శాతం పెళ్లిళ్లు ఫేక్ అని ‘హిట్-3’ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్ అన్నారు. ‘ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. ఇండస్ట్రీలోని వారికే నిజాలు తెలుసు. ఏదో ఒక రోజు ఈ అంశాలు కథగా లేదా పుస్తక రూపంలో లేదా సినిమాగా రావచ్చు. ఒకరినొకరు మోసగించుకోవడం, పలువురితో సంబంధం కలిగి ఉండటం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. పెళ్లి అంటే ఒక జోక్ అయింది’ అని భార్య ప్రియా బెనర్జీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News February 7, 2026
పరకాల మున్సిపల్ ఎన్నికలు: 11న సెలవు ప్రకటన

పరకాల మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 11న కలెక్టర్ స్నేహ శబరీష్ సెలవు ప్రకటించారు. ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఫ్యాక్టరీల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 10, 11, 13 తేదీల్లో సెలవు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


