News April 15, 2025
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కా కార్యచరణ అమలు చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు రబ్బర్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News February 27, 2026
సాగర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలు!

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537 అడుగుల మేరకు 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 51 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాలకు 65 టీఎంసీల అవసరం ఉందని తెలిపారు. అందువల్ల కనీస నీటిమట్టాన్ని కొనసాగించేందుకు కుడి, ఎడమ కాలువలకు జలాల విడుదలలో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.
News February 27, 2026
హనుమకొండ: ఫార్మర్ రిజిస్ట్రీ 67.89%

జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పురోగతి సాధారణంగా ఉంది. జిల్లాలో మొత్తం 1,52,220 పట్టాదారుల్లో 1,03,344 మంది నమోదు చేసుకొని 67.89 శాతం పూర్తి చేశారు. గడువు ఈ నెల 28తో ముగియనుండటంతో మిగిలిన రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యూనిక్ ఐడీ లేకుండా భవిష్యత్తులో కేంద్ర వ్యవసాయ పథకాలు పొందడం కష్టమవుతుందని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో కూడా నమోదు సదుపాయం కల్పించారు.
News February 27, 2026
కర్నూలు: బొలెరో బోల్తా.. 50 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుటకలమర్రి స్టేజి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు నాలుగు అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆదోని ఆస్పత్రికి తరలించాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


