News December 13, 2025

సిరిసిల్ల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు’

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను ఇన్‌చార్జి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 14, 2025

సిద్దిపేట: వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల ఓటింగ్ పరిశీలన

image

జిల్లాలో నేడు 10 మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆయా ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వెబ్ కాస్టింగ్‌ను మానిటర్ చేయాలన్నారు.

News December 14, 2025

సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని <>సంజయ్ <<>>గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో 39 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG డిగ్రీ, డిప్లొమా, DNB అర్హతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://sgmh.delhi.gov.in

News December 14, 2025

నల్గొండలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు. ఆయన జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.