News March 18, 2026

సిరిసిల్ల: లక్కీ డిప్‌ ద్వారా ‘రేవంతన్న కా సహారా’ లబ్ధిదారుల ఎంపిక

image

తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌’ పథకం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఫఖీర్, దూదేకుల, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు మోపెడ్‌లు, బైక్‌లు, ఈ-బైక్‌లను అందించే లక్ష్యంతో జిల్లాకు కేటాయించిన ఐదు స్థానాలకు ఐదుగురు లబ్ధిదారులను కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.

Similar News

News March 30, 2026

ఇరాక్‌కు మొజ్తబా థాంక్స్.. సుప్రీంలీడర్ మెసేజ్‌లకే పరిమితమా?

image

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఉనికిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇరాక్‌కు సందేశం పంపడం చర్చనీయాంశమైంది. తమకు మద్దతుగా నిలిచినందుకు మొజ్తబా ఇరాక్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొజ్తబా పబ్లిక్‌కు కనిపించకుండా సందేశాలతో మేనేజ్ చేస్తున్నారు. దీంతో ఆయన చనిపోయి ఉండొచ్చన్న <<19498351>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.

News March 30, 2026

అనంతపురం జిల్లాలో కొత్త నియోజకవర్గాల జాబితా వైరల్

image

ఉమ్మడి ​అనంతపురం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఓ జాబితా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ జాబితాలో నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు, వాటి పరిధిలోని మండలాల వివరాలను కూడా పేర్కొన్నారు. కేవలం ప్రచారంలో ఉన్న ఈ జాబితాను చూసి ప్రజలు, రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాల సంఖ్య 20కి చేరే అవకాశం ఉంది.

News March 30, 2026

HYD: రేషన్ కార్డుల్లో మన మూడు జిల్లాలే TOP

image

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక- ఆర్థిక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్యలో HYD మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 8,39,625 మందికి రేషన్ కార్డులు ఉన్నట్లు వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో RR జిల్లాలో 6.53 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 6.41 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. రికార్డులను పరిశీలిస్తే.. BPL కింద ఉన్నవారు, మన జిల్లాలోనే అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.