News March 28, 2025
సిరిసిల్ల: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డిఎంహెచ్వో

ప్రవేట్ స్కానింగ్ సెంటర్‌లో లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. స్కానింగ్ సంబంధించిన ధరల పట్టిక, ఇతర సర్టిఫికెట్లను గోడలపై ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు ప్రదర్శించేలా చూడాలని పేర్కొన్నారు. వైద్యులు అంజలినా ఆల్ఫ్రైడ్, శోభారాణి ఉన్నారు.
Similar News
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.
News March 31, 2025
గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
News March 31, 2025
కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 2నుంచి ఉచిత కోచింగ్

జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. ఆలమూరు, కొత్తపేట, కాట్రేనికోన, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో కోచింగ్ ఇస్తామని జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు సోమవారం తెలిపారు. పాలిటెక్నిక్, APRJC, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్‌పై పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.