News December 23, 2025

సిరిసిల్ల: ‘వారం రోజుల్లో కూలీ పెంచకుంటే సమ్మెకు దిగుతాం’

image

పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు అవుతున్నా కూలీ పెంచడం లేదంటూ మంగళవారం సిరిసిల్లలో సీఐటీయూ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారం రోజుల్లో పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించిన కూలీ పెంచకపోతే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు.

Similar News

News December 25, 2025

ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. రోజూ రూ.15వేలు ఆదాయం

image

రూ.లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి.. సాగు బాట పట్టి సక్సెస్ అయ్యారు ఝార్ఖండ్‌‌లోని అంబతాండ్‌కు చెందిన యువరైతు ఉదయ్ కుమార్. బీటెక్ పూర్తి చేసి పుణేలో IT జాబ్ పొందిన ఉదయ్ సొంతూరిని వదిలి ఉండలేకపోయారు. 6 నెలలకే జాబ్ వదిలి, ఊరుకు వచ్చి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ పండిస్తూ రోజూ రూ.15వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఉదయ్ పడ్డ కష్టాలు, సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 25, 2025

KMM: JAN 3న బర్త్ డే.. అంతలోనే తీవ్ర విషాదం

image

ఖమ్మంలో <<18659184>>ఈతకు <<>>వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన తెలిసిందే. సుల్తాన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ సుహాన్, శశాంక్, ఈశ్వర్‌ ఈతకు వెళ్లారు. ముగ్గురు నీటిలో దిగగా.. ఈశ్వర్‌ మునిగిపోతుండటంతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. JAN 3న సుహాన్ బర్త్ డే. అందుకోసం కొన్న బట్టలను మార్చురీలో ఉన్న తమ కుమారుడి మృతదేహానికి తొడిగి పెరేంట్స్ విలపించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.

News December 25, 2025

క్రిస్మస్ శుభాకాంక్షలు

image

అంతటా క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. ప్రపంచమంతా కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు అంతా పవిత్ర పండుగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినప్పుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసు బోధించారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లోనే ఆయన ఉంటాడని చెబుతారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.