News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్‌లో ఆడి పాడి సేద తీరారు.
Similar News
News December 3, 2025
సేమ్ రింగ్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్!

సమంత-రాజ్ పెళ్లి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లపాటు రిలేషన్‌ను కొనసాగించిన ఈ జంట ఈ నెల 1న <<18438537>>ఒక్కటైంది<<>>. అయితే రాజ్‌తో ఫిబ్రవరిలోనే ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తోంది. వాలంటైన్స్ డేకు ముందు రోజు(FEB 13) పోస్ట్‌లో, తాజాగా పెళ్లి ఫొటోల్లోనూ ఒకే రింగ్ కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా వీరి రిలేషన్ గురించి పలు సందర్భాల్లో ఫొటోలతో హింట్ ఇచ్చారు.
News December 3, 2025
వనపర్తి: నిన్న ఒక్కరోజే 1,608 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు నిన్న ఒక్కరోజే 1,608 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 250
✓ అమరచింత మండలం – 216
✓ కొత్తకోట మండలం – 392
✓ మదనాపూర్ మండలం – 299
✓ వనపర్తి మండలం – 451 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 2,062కు చేరింది.
News December 3, 2025
వనపర్తి: నిన్న ఒక్కరోజే 442 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీలకు నిన్న ఒక్కరోజే 442 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఆత్మకూరు – 68 నామినేషన్లు.
✓ అమరచింత – 54 నామినేషన్లు.
✓ కొత్తకోట – 102 నామినేషన్లు.
✓ మదనాపురం – 82 నామినేషన్లు.
✓ వనపర్తి – 136 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు 741 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.


