News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో సెమీఫైనల్స్ చేరిన జట్లు ఇవే

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో బాలికల విభాగంలో నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జట్లు సెమీఫైనల్స్ కు చేరాయి. తొలి రెండు రోజులలో పది జిల్లాల జట్ల మధ్య 20 మ్యాచ్ లు నిర్వహించామని, ఇందులో నాలుగు జట్లు సెమీఫైనల్ చేరాయని రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు.
Similar News
News March 30, 2026
విశాఖ: బతికున్నా చంపేశారు.. సచివాలయ సిబ్బంది నిర్వాకం

సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సర్వేలో నిర్లక్ష్యం వహించడంతో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ వర్మ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రోడ్డు సచివాలయానికి చెందిన రాజేశ్వరి, రెల్లి వీధి సచివాలయం శ్యామలరావు, దస్పల్ల హిల్స్ సచివాలయం కృష్ణారావులను సస్పెండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో కొందరిని చనిపోయినట్లుగా వీరు నమోదు చేశారని పేర్కొన్నారు.
News March 30, 2026
VZM: హైవేపై బీటెక్ స్టూడెంట్ మృతి

తగరపువలస సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి ధరన్‌శ్రీ ఆదివారం అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురానికి చెందిన ధరన్ ఇక్కడ కళాశాలలో చదువుతుండగా స్నేహితులను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి బయటికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.
News March 30, 2026
KNR: పురుషాధిపత్యానికి చెక్.. మహిళా శకానికి నాంది!

ఉమ్మడి KNR జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మార్పులు గనుక అమల్లోకి వస్తే దశాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిపత్య రాజకీయాలకు బ్రేక్ పడి జిల్లాలో మహిళా శకం ప్రారంభం కానుంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే 6-7 మహిళ స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల నియోజకవర్గాల్లో పట్టు సాధించిన పురుష నేతలు తమ స్థానాలను వదులుకోవాల్సిందే.


