News October 5, 2025
సిరిసిల్ల: ‘వాహనాల ట్యాక్స్ చెల్లించాలి’

సిరిసిల్ల జిల్లాలో సరకు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ రవాణా శాఖ అధికారి వంశీధర్ శనివారం సూచించారు. ఆయా వాహనాలను రోడ్డు ట్యాక్స్ కట్టకుండా వినియోగిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల డివిజన్‌కు సంబంధించి 2,787 వాహనాలు, వేములవాడ డివిజన్‌కి సంబంధించి 1,632 వాహనాలు ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News March 29, 2026
ADB: రేపటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30, 31తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. సందేహాల కోసం 9494149416ను సంప్రదించాలన్నారు.
News March 29, 2026
కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.
News March 29, 2026
జోనితా గాంధీ ఎవరంటే?

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.


