News August 28, 2025
సిరిసిల్ల: విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలెవరూ వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంలో అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

CM చంద్రబాబు పర్యటన సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్ వద్ద ముందస్తు చర్యలు, VIP ప్రోటోకాల్, గ్రీన్ రూమ్ ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. నోవాటెల్, రాడిసన్ బ్లూ రిసార్ట్‌లలో జరిగే సమావేశాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ట్రేడ్ ప్రొమోషన్ కౌన్సిల్‌తో సమన్వయం చేయాలన్నార
News August 28, 2025
MHBD: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్), స్థానిక వాట్సప్ గ్రూపుల ద్వారా అందించి అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి పశుసంపద, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News August 28, 2025
కుప్పానికి సీఎం.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు 29వ తేదీ సాయంత్రం 6:30 గం.తుమ్మిసి హెలిపాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి శివపురంలోని సొంతింటికి చేరుకుంటారు. రాత్రి 7:30 గం.కు కడ అడ్వైజరి కమిటీతో సమావేశం, రాత్రి సొంతింట్లో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్సులో పరమసముద్రంకు వస్తూ వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో చర్చించనున్నారు. 11:30 గంటలకు హంద్రీనీవాకు జల హారతి, 11:55 గం.కు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.