News August 23, 2025

సిరిసిల్ల: ‘విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది’

image

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరు రంజిత్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రంజిత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందన్నారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే మూల్యం చెల్లిస్తుందన్నారు.

Similar News

News August 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: తుమ్మల

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని స్థానిక నేతలకు ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ నేతలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ఇంటింటికీ వివరించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News August 23, 2025

తూప్రాన్‌: ఏపీకే ఫైల్ డౌన్లోడ్.. రూ.లక్ష డెబిట్

image

ఫోన్లో ఆటోమేటిక్‌గా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ జరిగి రూ. లక్ష ఖాతా నుంచి డెబిట్ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి ఫోన్లో 19న ఏపీకే ఫైల్ డౌన్లోడ్ జరిగి రాత్రి రూ.లక్ష మంజీరా బ్యాంక్ నుంచి డెబిట్ జరిగింది. బ్యాంకు అధికారులను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు మోసం చేసినట్లు గుర్తించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వివరించారు.

News August 23, 2025

కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

image

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.