News March 1, 2025

సిరిసిల్ల: విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ప్రవీణ్

image

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం డీఈఓ కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News December 28, 2025

ప్రకాశం: ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్

image

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

News December 28, 2025

రేపు ప్రజావాణి యథాతధం: ASF కలెక్టర్

image

ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యథాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 28, 2025

అమ్మతనానికే కళంకం.. ఇదేనా కన్న ప్రేమ?

image

కొందరు మహిళలు అమ్మతనానికే కాదు.. స్త్రీ జాతికే కళంకం తెస్తున్నారు. యూపీకి చెందిన సంగీత అనే వివాహిత వేరే యువకుడితో అఫైర్ పెట్టుకుని ఐదుగురు పిల్లలను గాలికొదిలేసి ప్రియుడితో పరారైంది. మరోవైపు TG నిజామాబాద్‌లో ఓ తల్లి నవమాసాలు మోసి, కని.. ముక్కు పచ్చలారకుండానే ఆ పసికందును గోదాట్లో కలిపేసింది. కన్నతీపి, పేగుబంధం అనే పదాలకు అర్థం తెలిసిన వాళ్లెవరూ ఇలా చేయరేమో? వీళ్లు అమ్మతనాన్నే అవమానించారు.